టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం ఈయన సినిమాలలో బిజీగా ఉంటూనే నా అనుకున్న వారికి అండగా నిలబడడంలో కూడా ముందుంటున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే అల్లు వారి కాంపౌండ్ నుంచి ఎంతోమంది ఎదగడం మనం చూసాము.ఇక వారిని నమ్ముకున్న వారి ఎదుగుదల వెనుక అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉండడం వల్లే నమ్ముకున్న వారికి అల్లు అర్జున్ సహాయం చేస్తే ఎలా ఉంటుందో కూడా నిరూపణ అయింది.

Allu Arjun rewards his personal driver heftily - TeluguBulletin.com

ప్రస్తుతం తన వద్ద 10 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడని తెలిసి అతడికి ఏకంగా 15 లక్షల రూపాయలను బహుమతిగా అందించారు.స్వయంగా డ్రైవర్ ఇంటికి వెళ్లి చెక్ అందజేశారు అల్లు అర్జున్. డ్రైవర్ కుటుంబంతో అల్లు అర్జున్ గతంలో దిగిన ఒక ఫోటో తో సహా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్ కి చెందిన మహిపాల్ అనే వ్యక్తి అల్లు అర్జున్ వద్ద గత పది సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన బోర్ బండలో ఇల్లు నిర్మించుకుంటున్న నేపథ్యంలో ఆ ఇంటి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ.15 లక్షలు అందజేసి మంచి మనసు చాటుకున్నారు బన్నీ..

అంతేకాదు నిన్నటికి నిన్న కేరళలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మద్దతుగా we are for Aleppey లో భాగంగా ఒక కేరళ విద్యార్థినికి నాలుగు సంవత్సరాల పాటు తన నర్సింగ్ విద్యకు అవసరమయ్యే ప్రతి రూపాయి కూడా తానే భరిస్తానని.. ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని కేరళ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అల్లు అర్జున్ ఇలా ప్రతిసారి ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకుంటూ తన మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఇది బన్నీ అన్నా అంటే అంటూ ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ మరింతగా తన దాతృత్వాన్ని నిరూపించుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *