రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్అర్ సినిమాతో మంచి ఇమేజ్ను అందుకున్నాడు హీరో రామ్ చరణ్.  ఏకంగా ఆస్కార్ స్థాయికి ఈ సినిమా వెళ్లడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. ఒక తెలుగు సినిమా ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అయితే అంతటి గొప్ప సినిమా చేసిన తర్వాత మరొక సినిమా అలానే చేసే విధంగా రాంచరణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పటికే ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ స్థాయిలోనే రూపొందుతున్న సినిమా కావడం విశేషం. అయితే ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమా విషయంలో చాలా అయోమయానికి ఈ హీరో గురవుతున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే ఏ దర్శకుడుతో తన తదుపరి సినిమా చేయాలి. ఎలాంటి జోనర్ లో ఆ సినిమాను చేయాలి అన్న అయోమయంలో చరణ్ ఉన్నాడట.

ఈ అయోమయంలోనే ఇప్పటికే ఓకే చేసిన సినిమా ను క్యాన్సల్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆ చిత్రాన్ని చేసి ఉంటే బాగుండేదని చరణ్ అభిమానులు సైతం చాలాసార్లు చెప్పారు. కానీ ఫైనల్ గా ఆ సినిమాను క్యాన్సిల్ చేయడం జరిగింది. దీంతో ఆయన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

కొంతమంది బాలీవుడ్ దర్శకులతో సినిమాలను చేయడానికి ఈ హీరో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తుంది. తొందరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రాబోతుంది అంటున్నారు. అంతేకాదు మరి కొంతమంది టాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏది ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *