అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి జోష్ సినిమాతో అడుగు పెట్టారు అక్కినేని నాగ చైతన్య. ఇక ఈయన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా సరైన హిట్టు పడలేదు. దీంతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక ఏ మాయ చేసావే సినిమాలో హీరోయిన్గా నటించిన సమంతతో ప్రేమలో పడి 2017లో గోవాలో చాలా గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు.

కానీ ఏమైందో ఏమో కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీరిద్దరి వివాహ బంధం నాలుగేళ్లు గడవకముందే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకొని ఎవరి సినిమాల్లో వారు బిజీ అవుతున్నారు. ఇక సమంత సినిమాల పరంగా మరింత యాక్టివ్ అయ్యి వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇక చైతు నటించిన రెండు సినిమాలు ఈ మధ్య నే రిలీజయ్యి డిజాస్టర్ కావడంతో రాబోయే సినిమానైనా హిట్టు కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో నాగచైతన్యకు సంబంధించి ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతుంది. అదే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని.. అవును నాగచైతన్య సమంతతో విడిపోయాక ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో నాగాచైతన్య ఒంటరితనాన్ని చూడలేక నాగార్జున ఎప్పుడెప్పుడు అతనికి పెళ్లి చేయాలా అని ఎదురు చూస్తున్నారట. కానీ చైతన్య మాత్రం ఎప్పటికప్పుడు పెళ్లికి నో చెబుతూ వస్తున్నాడట.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడట. అయితే నాగచైతన్య ఓ బడా బిజినెస్ మాన్ కూతురిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక నాగచైతన్య మీద వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కచ్చితంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *