బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం చాలా అట్టాహాసంగా కొనసాగుతోంది. ఇప్పటికే 9 వారాలు పూర్తిచేసుకుని పదవ వారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ టాస్కులు అన్నింటినీ చాలా కఠిన తరం చేశారు. మొదట్లో కొంత నత్తనడకన సాగిన ఈ షో ఇప్పుడిప్పుడే అదిరిపోయే టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. కంటెస్టెంట్లు అందరూ కూడా చాలా కసితో చిరుత పులుళ్లగా ఆడుతున్నారు.

కానీ గత రెండు వారాల నుంచి ఊహించని ఎలిమినేషన్స్ తో ఈ షో పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. బాగా ఆడుతున్న కంటెస్టెంట్లు అందరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపిస్తున్నారు.షోకి కావాల్సినంత కంటెంట్ ఇచ్చే గీతు లాంటి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం.. చూస్తుంటే ఈ సీజన్లో బిగ్ బాస్ తొండి ఆట ఆడుతుందని అనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ నెగిటివిటీని బాగా గమనించిన బిగ్ బాస్ టీం ఎలిమినేట్ అయినటువంటి ఇద్దరు సభ్యులలో ఇద్దరికీ వైల్డ్ కార్డు అంటే ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. బిగ్బాస్ సీజన్ 2 లో కూడా ఎలిమినేట్ అయిన నలుగురు సభ్యుల్లో ఆడియన్స్ పోల్స్ పెట్టి ఎక్కువ ఓట్లు వచ్చిన టాప్ 2 కంటెస్టెంట్లను లోపలికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్జున్ కళ్యాణ్, గీతూ,సూర్య, ఆరోహి బిగ్ బాస్ టీం పోలింగ్ లో పెట్టడానికి ఎంచుకున్నట్టు టాక్.

ఇందులో ముఖ్యంగా అర్జున్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని ఆయన్ని ఎలా ఎలిమినేట్ చేశారని అభిమానుల నుంచి అభిప్రాయాలు రావడం మనం ఇప్పటికే చూసాం. దీంతో ఈయన కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గీతు ఎలిమినేషన్ అవ్వడాన్ని ఇంటి సభ్యులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతలా ఫీలయ్యారో మనందరికీ తెలుసు. మరి ఓటింగ్ ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు రావడంతో అభిమానులు అందరూ సంతోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *