ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లోనే తాను ఎంతగానో ప్రేమించిన రణ్బీర్ కపూర్ ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇక వీరి పెళ్ళైన రెండు నెలలకే అలియా భట్ నేను ప్రెగ్నెంట్ అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరూ షాక్ అయ్యారు. పెళ్ళై రెండు నెలలే కావడంతో ఇంత తొందరగా గుడ్ న్యూస్ ఎలా చెప్పింది అని ఆశ్చర్యపోయారు.

ఇక ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీన అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయంలో కూడా చాలామంది నెటిజెన్లు అలియా భట్ ని ట్రోల్ చేశారు. ఎందుకంటే పెళ్లి అయినా ఏడు నెలలకే బిడ్డ పుట్టింది అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. నంబర్ 6వ తేదీన ఆదివారం అలియాభట్ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత గురువారం రోజున హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు ఆలియా భట్ దంపతులు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. అలియా భట్ తన పాపని ఇప్పటికి కూడా బయటికి చూపించడం లేదు. అంతేకాకుండా తన పాప మొహాన్ని ఎవరు చూడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట అలియా భట్. అయితే ఆలియా భట్ ఇంటికి వచ్చాక తన బంధువులు,స్నేహితులు, సన్నిహితులు అందరూ అలియా భట్ ని అలాగే తన పాపని చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. కానీ అలియా భట్ మాత్రం వారికి తన పాపను చూపించాలంటే ఒక షరతు విధించిందట.

అదేంటంటే..తన క్యూట్ పాపని చూడడానికి కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకొని నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని కండిషన్ పెట్టిందట. అలా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తేనే తన క్యూట్ బేబీని చూపిస్తానని చెప్పిందట. దీంతో అలియా భట్ పెట్టిన కండిషన్ కి చాలామంది సన్నిహితులు, బంధువులు, స్నేహితులు నిరాశ పడుతున్నారట. ఇక ఏది ఏమైనప్పటికీ అలియా భట్ పెట్టిన కండిషన్ విన్న చాలా మంది నెటిజెన్లు సరైన కండిషన్ పెట్టింది అని మెచ్చుకుంటుంటే,మరి కొంతమందేమో ఇలాంటి కండిషన్ లు పెట్టి స్నేహితులను, బంధువులను నిరాశ పరచడం మంచిది కాదు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *