ప్రేమ కథ సినిమాలను ఎంతో బాగా చేసే దర్శకుడైన హను రాఘవ పూడి ఇటీవల సీతారామం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.  ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు చేయబోయే తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది.  తాజాగాఎన్టీఆర్ కు ఓ కథ చెప్పడానికి ఈ దర్శకుడు రెడీ అయ్యాడట. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఉండే ఒక మాస్ మసాలా సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు అని తెలుస్తుంది.
కొరటాల శివ తో సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాను కూడా చేయాలని ఉద్దేశంతోనే హను రాఘవపూడి చెప్పే కథను వినబోతున్నాడట. ఆ విధంగా ఈ రెండు సినిమాలను ఒకేసారి చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఇకపోతే యువ దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో చేయవలసిన సినిమాను పూర్తిగా రిజెక్ట్ చేశాడు ఎన్టీఆర్. దాదాపుగా ఆ సినిమా ఎన్టీఆర్ తో లైనప్ లో లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హను రాఘవపూడి సినిమాను ఓకే చేస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *