టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు దగ్గుబాటి రానా.. లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రానా కేవలం హీరోగా కాకుండా విలన్ గా కూడా అలాగే నిర్మాతగా పలు టాక్ షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా అభిమానులను కలవరపరిచే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే హీరో రానాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారడం గమనార్హం.

Daggubati hero signs a multistarrer in Bollywoodభల్లాల దేవుడిగా బాహుబలి సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకున్న రానా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. గతంలో ఈయనకు ఒక కన్ను సరిగ్గా కనిపించేది కాదు అనే వార్తలు వచ్చినప్పటికీ.. ఇదే కాకుండా ఈయన మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రానా తన అభిమానులను ప్రోత్సహించడానికి తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి వెల్లడించారు. రానా కేవలం ఒక కంటితో మాత్రమే చూడగలడని చాలామందికి తెలియదు.

ఇదే కాకుండా కిడ్నీ మరియు గుండె సమస్యలతో కూడా బాధపడుతున్నారట. అప్పట్లో ఈయన ఆరోగ్య పరిస్థితి గమనించిన డాక్టర్లు పక్షవాతం సమస్య 70% వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపినట్లు వెల్లడించారు. అయితే రానా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఏది ఏమైనా రానా ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నాడు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఆ సమస్యల నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈయన నటించిన విరాటపర్వం సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *