ఎట్టకేలకు యంగ్ హీరో నాగ శౌర్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నవంబర్ 20వ తేదీన బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఉన్నట్టుండి ఏకంగా పెళ్లి డేట్ ప్రకటించిన నాగశౌర్యను చూసి.. ప్రేమ వివాహం చేసుకుంటున్నాడా ? లేక పెద్దలు కుదిర్చిన వివాహమేనా? అనే అనుమానాలు కూడా అభిమానులలో రేకెత్తుతున్నాయి. అయితే ఎలాంటి అనుమానాలు పుట్టుకొచ్చినా సరే ఆయన మాత్రం నవంబర్ 20వ తేదీన వివాహం చేసుకోబోతున్నానంటూ అందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డును కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

 

Tollywood actor Naga Shaurya is getting married!
ఈ క్రమంలోనే నాగశౌర్య వివాహం చేసుకోబోతున్న అనూష శెట్టి ఎవరు అనే తెలుసుకోవడానికి అభిమానులు గూగుల్ సర్చ్ మొదలుపెట్టారు.. ఈ క్రమంలోనే అనూష శెట్టి గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇక ఆమె టాలెంట్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి సర్టిఫికెట్ కూడా పొందిన అనూష శెట్టి బెంగళూరులోని కుందాపూర్ గ్రామానికి చెందినవారు. ఇక ఈమె ఎంటర్ప్రెన్యూర్షిప్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. అంతేకాదు బెంగళూరులో ఈమెకు సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే ఒక సంస్థ కూడా ఉంది.

Naga Shaurya Fiance Anusha shetty business and asset details here | నాగ  శౌర్యకు కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. వ్యాపారాలు, వందల కోట్ల ఆస్తి!–  News18 Telugu

మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ సంస్థకు పని చేస్తున్న అనూష శెట్టి 2019లో డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది . అంతేకాదు 2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా టాప్ ప్లేస్ లో నిలవడం గమనార్హం. తన అద్భుతమైన డిజైనింగ్ తో ఎంతో మందిని ఆకర్షించడమే కాకుండా ఎన్నో అవార్డులను సైతం గెలుపొందింది. మొత్తానికి అయితే మంచి టాలెంటెడ్ ఉన్న అమ్మాయిని నాగశౌర్య పట్టేసాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

ఏదిఏమైనా నాగశౌర్యకు కెరియర్ పరంగా ఒక్క మంచి హిట్టు పడకపోయినా.. వ్యక్తిగత విషయంలో వైవాహికంగా సూపర్ లక్కీ అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *