టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ వరుస పరాజయాలతో సతమత మవుతున్నాడు. మొదట్లో ఒకటి రెండు హిట్లర్ ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఆ తరువాత వరుస దారుణ పరాజయాలతో అందరిని నిరాశ పరుస్తున్నాడు. అలా ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఓరి దేవుడా చిత్రం కూడా ఆయన ఖాతాలో మరొక ఫ్లాప్ గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమాకు నిరాశాజనకమైన వసూళ్లు రావడంతో ఇప్పుడు తన కెరియర్ పై మరొకసారి పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాడు ఈ హీరో.
ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విశ్వక్ ఆ తరువాత చేసిన ఫలక్ నుమా దాస్ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం కొన్ని వర్గాలకు ప్రేక్షకులకు నచ్చకపోయినా కూడా బీ,సీ సెంటర్లలో మంచి వసూళ్లు రాబట్టుకోవడంతో సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో విశ్వక్ ఆ తర్వాత చేసిన సినిమాలు ప్రేక్షకులను కొంత మేరకే అలరించినా కూడా హిట్ సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పాలి.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సీక్వెల్ లో కూడా ఈ హీరో నటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పారితోషకం విషయంలో నిర్మాతతో విభేదాలు రావడంతో ఆ సినిమా సీక్వెల్ ఈయన చేయలేకపోయాడు. మరొక హీరోతో వారు ఈ సినిమా సీక్వెల్ చేయగా ఆ సినిమాను ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కథల ఎంపిక విషయంలో విశ్వక్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. విశ్వక్ ఈ పరిస్థితిని గనుక అధిగమించగలిగితే తప్పకుండా మంచి కథలు ఆయనకు రావడం ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తున్నారు. వాటి ద్వారా ఆయన విజయాలను అందుకొని ప్రేక్షకులను అలరిస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *