సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రెటీలు సైతం చురుకుగా ఉంటున్నారు. సామాన్య ప్రజలు అయితే కేవలం అందులో ఫొటోలు, వీడియోలు, పలు రీల్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం కేవలం ఒక్క పోస్ట్ పెడితే చాలు ఫాలోవర్స్ పెరగడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు లాభం వస్తుందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలా ఇన్ స్టాగ్రామ్ నుంచి ఎంతోమంది హీరోయిన్స్ , సెలబ్రిటీలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా హాట్ ఫొటోస్ టాప్ బ్రాండ్ ప్రమోషన్స్ తో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు హీరోయిన్స్. ముఖ్యంగా వారు షేర్ చేసే ఫోటో షూట్ ల వెనుక పలు కారణాలు ఉంటాయని చెప్పవచ్చు. మరి సోషల్ మీడియా ద్వారా స్టార్ హీరోయిన్స్ ఎంత డబ్బులు సంపాదిస్తారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Samantha Akkineni hits 13 million followers on Instagram a day after Pooja  Hegde hit 12 million followers | PINKVILLAముందుగా బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్లలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉన్నది. మంచి కథలతో సినిమాలు తీయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు కమర్షియల్ బ్రాండెడ్ కు సంబంధించిన వాటి వల్ల తను ఈఎమ్ఐ కట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతున్నాయని తెలియజేస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ తన ఫేస్ కు సంబంధించిన ఫోటోలు పెట్టడానికి అసలు ఇష్టపడనని తెలియజేసింది. జాన్వీ కపూర్ బ్రాండ్ ను పట్టి ఒక పోస్టుకు రూ. 50 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటుందట.

ఇక టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా పేరుపొందింది సమంత. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేసిందంటే చాలు సమంత వాటికి రూ.3 కోట్ల రూపాయలకు పైగా అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ బాలీవుడ్లో ఇప్పటికి తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి దాదాపుగా రూ.1.25 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.

Ranbir Kapoor and Alia Bhatt: Bollywood toasts star couple on wedding - BBC  News

ఇక బాలీవుడ్ అందాల హీరోయిన్ ఆలియా భట్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఒక్కో పోస్ట్ షేర్ చేస్తే రూ.85 లక్షల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

Deepika says Gehraiyaan role was 'hard to digest' for her ...

మరొక హీరోయిన్ దీపికా పదుకొనే.. సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్ షేర్ చేస్తే రూ.1.50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

అయితే ఇందులో బ్రాండ్ ను బట్టి కూడా రెమ్యూనరేషన్ చేంజ్ అవుతూ ఉంటుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *