ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన కుటుంబానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తాజాగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ జోడిగా నటించిన ఈ చిత్రం యూత్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కింది. దీంతో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా యువతను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు శిరీష్ తో హోస్ట్ అలీ ఇలా అడిగారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ గారితోనే అడగాలని అనుకున్నాను. కానీ ఆయన ఎమోషనల్ అవుతారని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను.. మీ నాన్నగారికి ఎంతమంది సంతానం అని హోస్ట్ అలీ అడిగారు.. ఈ విషయంపై అల్లు శిరీష్ స్పందిస్తూ..” మా తల్లిదండ్రులకు నలుగురు సంతానము.. పెద్దన్నయ్య వెంకట్ కాగా రెండో అన్నయ్య రాజేష్ , తర్వాత అర్జున్, నేను.. అయితే నేను పుట్టకముందే రెండో అన్నయ్య రాజేష్ యాక్సిడెంట్ లో మరణించాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ విషయం చెప్పగానే అటు హోస్ట్ ఆలీతోపాటు ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ అల్లు రాజేష్ ఉండి ఉంటే కచ్చితంగా హీరో అయి ఉండేవాడని… ఇండస్ట్రీకి మరో ఒక గొప్ప నటుడు దూరం అయ్యాడు అంటూ విచారణ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అల్లు అరవింద్ కు నలుగురు సంతానమైనా.. వారిలో ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం అల్లు అర్జున్ , ఆ తర్వాత అల్లు శిరీష్.. పెద్ద కొడుకు వెంకట్ మాత్రం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.. కానీ ఇతడు నిర్మాతగా వెనుక నుండి తన తమ్ముళ్లను ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *