ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవితం ఇప్పుడు బాగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె తన భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‏తో విడాకులు తీసుకుంటున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరు అధికారికంగా స్పందించలేదు. కానీ కొద్దిరోజులుగా సానియా తన ఇన్ స్టాలో చేస్తున్న పోస్టులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో సానియా చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయట.ఆమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్‏ను వివాహం చేసుకోవాలనుకుందట. ఈ విషయాన్ని బుల్లితెరపై ఓ షోలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పట్లో సానియా .. షాహిద్ కపూర్‏తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే తమ గురించి వస్తున్న రూమర్స్ వీరిద్దరు అధికారికంగా స్పందించలేదట.

గతంలో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ చాట్ షో కాఫీ విత్ కరణ్ కు వెళ్లినప్పుడు షాహిద్ కపూర్ తో డేటింగ్ వార్తలపై స్పందించింది సానియా. ఈ విషయాన్ని కరణ్ అడగ్గా.. వాటి గురించి తనకు పెద్గగా తెలియదని చెప్పుకొచ్చిందట సానియా. అలాగే.. మీరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. ఎవరిని చంపాలనుకుంటున్నారు.. ఎవరితో హుక్ అప్ చేయాలనుకుంటున్నారని అడగారు. అందులో రణబీర్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ముగ్గురు పేర్లు చెప్పగా.. తను రణబీర్ కపూర్‏ను పెళ్లి చేసుకుంటానని.. రణ్‌వీర్‌తో హుక్ అప్ చేస్తానని, షాహిద్ కపూర్‌ని చంపేస్తానని చెప్పింది. సానియా మీర్జా చేసిన ఈ ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైందట.

 

సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అప్పట్లో రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. వీరికి 2018లో ఇజహాన్ మిర్జా మాలిక్ కొడుకు జన్మించాడు. అయితే వీరిద్దరు విడిపోతున్నట్లుగా ఇటీవల షోయబ్ మిత్రుడు తెలిపారు. వారిద్దరు నిజంగానే విడిపోతున్నారని.. అంతకంటే వివరాలు చెప్పలేనంటూ కూడా తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *