విశ్వక్ సేన్ హీరోగా ‘ఓరి దేవుడా’ సినిమా తెరకెకెక్కిన విషయం తెలిసిందే. పీవీపీ వారు నిర్మించిన ఈ సినిమా, క్రితం నెల 21వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోయింది.

అయితే వెంకటేశ్ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించడమనేది కొంతవరకూ కలిసొచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు రాత్రి 12 గంటలకు.. అంటే తెల్లవారితే శుక్రవారమనగా, ‘ఆహా’ స్ట్రీమింగ్ జరుపుకోనుందని సమాచారం..ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ కూడా విడుదల చేసారు.. ఈ సినిమాలో విశ్వక్ సరసన మిథిల పాల్కర్ – ఆషా భట్ అలరించారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో మురళీ శర్మ మరియు నాగినీడు,రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు.

లవ్.. ఎమోషన్ తో నడిచే ఫ్యామిలీ డ్రామా ఇది. సరదాగా ఈ కథలోకి దైవాన్ని కూడా లాగారని తెలుస్తుంది.జీవితాన్ని ఎప్పుడూ ఒక కోణం నుంచే చూడకు .. రెండో కోణంలో నుంచి కూడా చూస్తేనే అసలు తత్వం మనకు అర్థమవుతుందనే కాన్సెప్టుతో నిర్మితమైన సినిమా ఇది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్న కారణంగా, ఓటీటీ నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభించే అవకాశం కూడా ఉంది.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *