ప్రముఖ నిర్మాత అయిన బండ్ల గణేష్ మరో సారి వార్తల్లో నిలిచాడు. తాజాగా బండ్ల గణేష్ అయ్యప్ప స్వాములతో కలిసి పాద యాత్రలో పాల్గొన్న ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

పాద యాత్ర చేస్తున్న అయ్యప్పలతో బండ్ల అన్న అంటూ ఆ ఫోటోలకి బండ్ల గణేష్ కామెంట్ పెట్టాడు.బండ్ల గణేష్ మాల వేశాడా లేదా అనేది తెలియదు.. కానీ స్వాములతో కలిసి బండ్ల గణేష్ కొద్ది సమయం అయితే పాద యాత్ర చేసినట్లుగా ఈ ఫోటోలను చూస్తుంటే అనిపిస్తుంది. అయ్యప్ప స్వాములతో కలిసి పాద యాత్ర చేస్తున్న సందర్భంగా బండ్ల గణేష్ స్వాముల మాదిరిగానే నల్ల దుస్తులను ధరించి ఉన్నాడని.

ఇక స్వాములతో కలిసి పాద యాత్ర చేసిన సందర్భంగా బండ్ల గణేష్ చెప్పులు ధరించి ఉండటం ను కొందరు అయితే తప్పు పడుతున్నారు. ఆ గ్రూపులో మరి కొందరు కూడా చెప్పులు వేసుకుని ఉన్నారు, అయ్యప్ప మాలలో ఉన్న చెప్పులు వేసుకోకూడదు అనే నిబంధన అయితే ఉంటుంది.అలాంటిది పాదయాత్ర చేస్తూ చెప్పులు వేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ బండ్లన్న అంటూ కొందరు అయితే ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోలకు రక రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

పాదయాత్ర అంటే వందల కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది.. కనుక కాళ్లకు ఇబ్బంది కాకుండా చెప్పులు లేదా సాక్స్‌ దరిస్తూ ఉంటారు. కనుక అందులో తప్పేం లేదని కొందరు వారికి మద్దతు కూడా తెలుపుతున్నారు.మొత్తానికి బండ్ల గణేష్ మరోసారి అయ్యప్ప స్వాములతో చెప్పులు వేసుకొని పాదయాత్రలో పాల్గొని వార్తల్లో అయితే నిలిచాడు. నటుడుగా మరియు నిర్మాతగా ఈయన మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *