టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా మారాయి. సడన్ గా నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బయటకు రావడంతో అందరిలో ఆ అమ్మాయి ఎవరు అనే ఆసక్తి నెలకొంది. నాగశౌర్య అనూష శెట్టి అనే బెంగళూరుకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటున్నారు సినీ జనాలు. నాగశౌర్య పెళ్లి నవంబర్ 20వ తేదీన ఘనంగా జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం అనుష శెట్టి గురించి చూసుకుంటే ఆమె బ్యాక్ గ్రౌండ్ లో ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయట.అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో మంచి ప్రావీణ్యత సాధించిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈమె న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి సర్టిఫికెట్ కూడా అందుకుందట.

అంతేకాకుండా ఎంటర్ ప్రేన్యూర్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసిందట. ఇక అనూష శెట్టి కి బెంగళూరు లో సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే పెద్ద సంస్థ కూడా ఉందట. ఇక ఈ సంస్థకి అనుష శెట్టి నే మేనేజింగ్ డైరెక్టర్. 2019 వ సంవత్సరంలో డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఆమె గెల్చుకుందట. ఇక 2020వ సంవత్సరంలో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో అనూష శెట్టి ఒకరిగా నిలిచిందట.

ఇక అనూష శెట్టి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఇమే ఎన్నో ఘనతలు సాదించిందని తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కి అనూష శెట్టికి నేరుగా ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకపోయినప్పటికీ కేవలం ఒకే ఒక చిన్న కనెక్షన్ ఉందట. అదేంటంటే అనుష శెట్టి పుట్టింది కర్ణాటకలోని కుందాపూర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని స్వస్థలం కూడా కర్ణాటకలోని కుందాపూర్ కావడంతో వీరిద్దరికీ ఆ చిన్న కనెక్షన్ ఉంది అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *