టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడుగా వరుస సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అయితే మహేష్ బాబు గురించి ఇప్పటికే ఎన్నోసార్లు రాజకీయాల్లోకి వస్తాడంటూ వార్తలు బాగానే వినిపించాయి.

కానీ ఆయన ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే రాజకీయాలంటే పెద్దగా నచ్చని మహేష్ బాబుకు ఓ స్టార్ పొలిటిషన్ అంటే చాలా ఇష్టమట. ఎంతలా అంటే ఏకంగా వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలా ఆమెను ఇష్టపడతారట. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు ఆ పొలిటిషన్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబుకు ఇష్టమైన పొలిటిషన్ ఎవరంటే..లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి. విజయశాంతి సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా నటించేది. మహేష్ బాబు చిన్నప్పుడే విజయశాంతి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసింది. ఇక ఈ సినిమాలో చేస్తున్న టైంలోనే మహేష్ బాబు కు విజయశాంతి మీద ఇష్టం ఏర్పడిందట.

అంతేకాదు విజయశాంతి బిహేవియర్, మాట్లాడే తీరు, ఆమె మైండ్ సెట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయని, అందుకే చిన్నతనం నుండి మహేష్ బాబుకు విజయశాంతి పై ఇష్టం ఏర్పడిందట. ఇక సినిమా షూటింగ్ టైం లో కూడా మహేష్ బాబు విజయశాంతి వెనకాలే తిరిగే వాడంటే ఆమె అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇక మహేష్ బాబు పెద్దయ్యాక కూడా విజయశాంతితో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారట. కానీ ఆ కోరిక సరిలేరు నీకెవరు అనే సినిమాతో నెరవేరిందని చెప్పుకొచ్చాడు. అంతే కాదు విజయశాంతితో మరొక సినిమా కూడా చేస్తానని సరరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ అయినప్పుడు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని బట్టి చూస్తే మహేష్ బాబుకు విజయశాంతి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *