వరల్డ్ పోర్న్ స్టార్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా మారిన బ్యూటీ సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.బాలీవుడ్‌ ఇండస్ట్రీ లో వరుసగా మూవీస్ చేస్తూ హై స్పీడ్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు రేర్ గా సౌత్ మూవీస్ లో కూడా నటిస్తోంది.మాక్సిమం ఐటమ్ సాంగ్స్‌తో ఆడియన్స్ని కనువిందు చేస్తుంటుంది. ఆమె తమిళంలో నటించిన కొత్త చిత్రం ‘ఓ మై ఘోస్ట్‌’ ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ మధ్య కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్న ఈమె ఐటమ్స్‌ సాంగ్స్‌ చేసేందుకు కొన్ని కండిషన్స్ విధిస్తోందని విశ్వాసనియ వర్గాల సమాచారం.వాటిని అంగీకరించిన దర్శక నిర్మాతలకే ఆమె కాల్ షీట్స్ ఇస్తుందని సమాచారం.రీసెంట్ గా డైరెక్టర్ జయమురుగన్‌ తీస్తున్న ఒక మూవీ లో ఐటమ్‌ సాంగ్‌ కోసం సన్నీ లియోన్‌ని అడిగియరట. అపుడు ఆమె చిన్నపిల్లలు ఉంటే కుదరదని మరియు తనతో పాటు చేసే డాన్సర్స్ కి గౌరవ మర్యాదలు ఇవ్వాలని, మరియు కరోనా నిబంధనలు పాటించాలని ఈ విధంగా అనేక కండిషన్స్ పెట్టి వాటికీ ఒప్పుకుంటేనే డేట్స్ ఇస్తాను అని గట్టిగా చెప్పిందట.ఐతే వాటన్నింటికి డైరెక్టర్ ఓకే చెప్పి ఆమె డేట్స్‌ తీసుకున్నారని సమాచారం.

ఈయన తీసే మూవీ కి ‘తీ ఇవన్‌’ అనే పేరు పెట్టారు.దీంట్లో కార్తీక్‌, సుకన్య, రాధారవి, సుమన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈమె తాజాగా నటించిన మూవీ ‘జిన్నా’ ఇటీవలే రిలీజ్ అయి ఫ్లాప్ టాక్‌ని తెచ్చింది.జిన్నా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది.ఐతే సన్నీ హ్యాండ్ లో ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *