సిల్క్ స్మిత నేటి యువతరానికి కూడా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన అంద చందాలతో కుర్ర కారును తన వైపు తిప్పుకున్న గ్లామరస్ బ్యూటీ.. గ్లామర్ ప్రపంచంలో ఈమె పేరు ఒక సెన్సేషన్.. మత్తు కళ్ళతో సిల్వర్ స్క్రీన్ కి గ్లామర్ ఇమేజ్ అద్దిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలలో అవకాశాలను అందుకొని స్టార్ హీరోలు సైతం ఈమె డేట్ల కోసం ఎదురుచూసే.. అంతలా పాపులారిటీ సంపాదించుకుంది సిల్క్ స్మిత.

Behind Silk Smitha : caste, sexism and celluloid image. – 1916

సినిమాలకు అప్పటివరకు కమర్షియల్ హంగులను మాత్రమే అద్దిన సెలెబ్రిటీలను సైతం పక్కకు నెట్టి గ్లామర్ ప్రపంచాన్ని సరికొత్త కోణంలో చూపించి కమర్షియల్ సినిమాలకు గ్లామర్ హంగులు అద్దిన ఘనత ఈమెకే సొంతం.వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డంను సొంతం చేసుకున్న సిల్క్ స్మిత తన అందచందాలతో మత్తెక్కించేది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత చివరి నిమిషంలో మాత్రం ఎన్నో బాధలను అనుభవించింది.

మలయాళం సినిమాతో వడ్లపట్ల విజయలక్ష్మి గా ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత .. స్క్రీన్ పై తన పేరును మార్చుకొని తిరుగులేని స్టార్ హీరోయిన్గా అనేక సినిమాలలో ఐటం సాంగ్స్ లో స్టెప్స్ వేస్తూ అందాల ఆరబోతతో అప్పట్లోనే సెగలు పుట్టించింది. 90 లలో ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరి హీరోల సరసన నటించి ఒక రికార్డు సృష్టించింది.ఇకపోతే ఒక స్టార్ హీరో వల్ల ఈమె కెరియర్ నాశనమైందంటూ అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.

అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఈమె కూడా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అలా 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లు ,చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద ఎత్తున నష్టాల పాలైనట్లు కూడా వార్తలు వచ్చాయి.. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను బలి తీసుకుంది. ఇలా చివరి దశలో ఎవరు తోడు లేక అనాధగా మిగిలి డిప్రెషన్ నుంచి బయటపడలేక బాధతో ఆత్మహత్య చేసుకుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *