బాలీవుడ్ స్టార్ నటి ఐనా దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నటి.మూవీస్ విషయంలో డిఫరెంట్ స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసుకుంటూ నటిగా మంచి పేరు తెచ్చే మూవీస్ చేస్తూన్న జాన్వీ సోషల్ మీడియాలో యువతను అట్ట్రాక్ట్ చేసేలా గ్లామర్ పోస్ట్‌లతో చెలరిగిపోతుంది.ఇటువంటి పోస్ట్ లతో జాన్వీ పలు బ్రాండ్ ఎంబాసిడర్లు ఖాతా తన పేరులో వేసుకుంది.దీని వల్ల భారీ మొత్తం సంపాదిస్తోంది.

ఈమధ్య తన సినిమా ‘మిలి’ రిలీజ్ సందర్భంగా అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ లను ఇచ్చింది. దీంట్లో భాగంగా గా సోషల్ మీడియాను సీరియస్‌గా తీసుకోకూడదని ఎప్పుడు సరదాగా ఉండాలని చెబుతూ తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఎక్పోజింగ్ పిక్స్ వల్ల తనకు చాలా డబ్బు సంపాదించటానికి ఈ పోస్ట్లు సహాయపడుతున్నాయనే విషయాన్ని చెప్పింది.

బ్యూటిఫుల్ గా కనబడి అందరి చేత ఆకర్షితులైతే నా యొక్క ఖాతాలో మరో బ్రాండ్‌ వచ్చి చేరుతుందని, అప్పుడు తన ఇన్వెస్ట్ మెంట్స్ కి తేలికగా ఈఏంఐ లను కట్టుకోవచ్చని చెప్పింది . తను నటించే మూవీస్ కు సోషల్ మీడియాలో చేసే పోస్ట్లు రెండూ భిన్నగా ఉంటాయని అంగీకరిస్తూనే ఉంది.

సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇమేజ్‌ తన ఆన్‌స్క్రీన్ క్యారెక్టర్‌తో సింక్‌ అవుతుందని ఆమె చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మూవీస్ల ద్వారా సంపాదించే మొత్తం కంటే సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువని జాన్వీ చెప్పింది. అందుకేనెమో ఇటీవల తన సోషల్ మీడియాలో ఎక్సపోసింగ్ డోస్ మరింతగా పెంచింది జాన్వీ. ఏదేమైనప్పటికీ ముద్దు వచ్చినపుడే చంక ఎక్కమన్నారు పెద్దలు అనే సామెత ను జాన్వీ బాగా ఫాలో అవుతుందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *