కొన్ని కొన్ని సార్లు కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు భలే తమాషా గా అనిపిస్తాయి.తాజాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా అదే జరగబోతోంది. ఈ మధ్యనే అల్లు శిరీష్ హీరోగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ తదుపరి సినిమాల గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారుతుంది.

త్వరలోనే నందమూరి హీరో కి ఒక స్క్రిప్ట్ నేరేట్ చేయబోతున్నాను అని డైరెక్టర్ పరశురామ్ ఓపెన్ గా చెప్పేశారు. గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్లు ఇంకా జరుగుతున్నాయట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఒక యువ డైరెక్టర్ కూడా బాలకృష్ణ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా. హ్యూమనిస్టిక్ మరియు రియలిస్టిక్ సినిమాలు తీయడంలో వెంకటేష్ మహా దిట్ట. బాలకృష్ణ కోసం కూడా వెంకటేష్ అలాంటి ఒక ఆసక్తికరమైన కథను రాసుకుని వినిపించారట. బాలయ్య కూడా సినిమాకి ఓకే చెప్పారని తెలుస్తోంది. వారాహి ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారటా..

గతంలో లెజెండ్ సినిమాని నిర్మించిన వీరు ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ యువ డైరెక్టర్ తో బాలయ్య ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *