టాలీవుడ్ స్టార్ నటి ఐనా సమంత మయోసైటిస్ అనే దీర్ఘకాల కండరాల వ్యాధితో బాధపడుతున్నా సంగతి అందరికి తెల్సిందే . ఈ వ్యాధి బారిన పడ్డానని ఎప్పుడైతే సమంత చెప్పిందో అప్పటినుండి సినీ పరిశ్రమ ప్రముఖులు మరియు అభిమానులు చాలా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఈమధ్య ఆమె మాట్లాడుతూ, ఈ వ్యాధిని తాను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘యశోద’ మూవీ ప్రమోషన్ కోసం తాను ఇచ్చిన ముఖ ముఖి సంభాషణలో ఆమె ఈ మేరకు ఆమె స్పందించారు. ప్రపంచంలో వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా మరియు వేగంగా ఎదుర్కొన్నారని సమంత చెప్పారు. తాను కూడా దీన్ని త్వరగా ఎదుర్కొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.ఇదే టైంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టుకున్నారు. మన యొక్క నియంత్రణలో ఏదీ ఉండదని మన లైఫ్ డిసైడ్ చేస్తుందని చెప్పారు.

తాను ఇప్పుడు కూడా కఠిన పరిస్థితిలోనే ఉన్నానని చెప్పారు.ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి,చెడు రోజులు ఉంటాయని ఆమె తెలిపారు. ఒక్కొక్క సారి ఒక్క అడుగు కూడా వేయలేనేమో అని అనిపిస్తుందని అన్నారు. అయితే, దీని మీద తాను పోరాటం చేస్తానని, గెలుస్తానని కాంఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె అభిమానులుగా సామ్ త్వరగా కోలుకోవాలి ఆశిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *