ఇటీవల జరుగుతున్నా సిట్యువేషన్స్ చూస్తుంటే సినీ హీరోయిన్లకు ప్రెసెంట్ గడ్డు కాలం నడుస్తోందా.. అని అనిపిస్తోంది. తమ అందాలతో , అభినయంతో చిత్రాలకు ఒక కళ ని మరియు బలాన్ని చేకూరుస్తూ ఎంటర్‌ టెయిన్‌ చే యడంలో కథానాయికలది ప్రధాన భూమిక అని చెప్పవచ్చు.

ఈ మధ్య కాలంలో అలాంటి హీరోయిన్లుకు ప్రమాదాలు జరగడం మరియు కొంతమంది అనారోగ్యాని గురి అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యనే నటి రంభ అమెరికాలో కారు ప్రమాదానికి గురై కొద్దిగల్లో ప్రాణా పాయం నుంచి బయటపడిన విష యం తెలిసిందే. అలాగే నటి పూజా హెగ్డే కూడా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలుకు గట్టిగా దెబ్బ తగిలింది. ఇక నటి త్రిష కూడా విదేశాల్లో ఇలాంటి ప్రమాదానికి గురైంది అని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.

కాగా మరో అగ్ర నటి ఐనా సమంత ఇటీవల మయోసైట్స్‌ అనే వింత వ్యాధికి గురైంది. ఈ అందాల తారమణులు త్వరగా కోలుకోవాలని వారి ఫ్యాన్స్ గా మేము ప్రార్థనలు చేస్తున్నాము.నటి సమంత ఇప్పటికీ ఆ వ్యాధితో పోరాడుతోంది మరియు . త్రిష ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతోంది. అలాగే మరో నటి క్రేజీ నటి పూజా హెగ్డే తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా చెప్పింది.

దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆమెకు లక్కీ విషయం ఏంటంటే ప్రెసెంట్ ఈమె నటిస్తున్న తెలుగు చిత్రాలేమీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో లేవు. త్వరలో ఆమె త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్ లో మహేష్‌ బాబుతో జతకట్టనున్న చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది. అప్పటికి పూజ పూర్తిగా కోలుకుంటుందని ఆశిద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *