ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు మరొకసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఆయన ఉన్మాదిలా దూషణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలను పడేసే అవకాశం,హక్కు ఓన్లీ ప్రజలకు మాత్రమే ఉంటుందని అంబటి చెప్పారు.గవర్నమెంట్ ను కూల్చేయటం అంటే సినిమా సెట్టింగ్ కూల్చేసే అంతా ఈజీ అనుకున్నారా అని పవన్ కళ్యాణ్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో యాభై మూడు ఇళ్లను కూల్చేశారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మొత్తం అబద్ధం అని,రోడ్డు వెడల్పు కోసం జనవరి మాసంలోనే మార్కింగ్ చేశారని రాంబాబు చెప్పారు.

ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదనుకుంటా అని కూడా అంబటి రాంబాబు ఏద్దేవా చేసారు. అలాగే ఇప్పటం విలేజ్ లో కూడా ఒక్క ఇల్లు కూడా పడగొట్టలేదని ఆయన అన్నారు. ”పవన్ కళ్యాణ్‌ను చంపడానికి రూ. 250 కోట్ల సుపారీ ఇచ్చారని, ఎవరికో ఇచ్చేబదులు పవన్ కే అందులో సగం ఇస్తే ఆయన మా వెంట వచ్చేస్తారు కదా అని తీవ్ర వ్యాఖ్యలు ఆయన పవన్ మీద చేసారు.

ఇదిలావుంటే ఒక చిన్న రాయితో చంద్రబాబు పై దాడి జరిగిందని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి అభిమానులకి తనిచ్చే సలహా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాది అని, యువత జాగ్రత్తగా ఉండాలని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *