టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లలో ఒకరైన హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయినా ఇంకా మొదలు కాకపోవడం అయన అభిమానులను నిరాశపరుస్తుంది. అయితే ఈ సినిమా ను అయన పూర్తిగా పక్కన పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈనేపథ్యంలో అయన తదుపరి సినిమా చేసేవిధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. గతకొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్ చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో అయన సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించినా అయన సల్మాన్ తో ఫోటో దిగడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సల్మాన్ తో ఎలాగైనా సినిమా ఫైనల్ చేయించుకోవాలనే ఆలోచనతో దర్శకుడు హరీష్ శంకర్ బాలీవుడ్ హీరో సల్మాన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట. ప్రస్తుతం తనని ఒప్పించడానికి హరీష్ శంకర్ ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది. హరీష్ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *