రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చరణ్ ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించవలసిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు కేన్సిల్ అయినట్టుగా మేకర్స్ ప్రకటించారు.

గౌతమ్ తిన్ననూరి తొలి సినిమా అయిన ‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే కథను హిందీలో రీమేక్ చేశాడు. అయితే అక్కడ ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఈ లోగా చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందువలన గౌతమ్ కథ పాన్ ఇండియా స్థాయిలో లేదనే కారణంగా చరణ్ ఆసక్తి చూపకపోవడం జరిగిందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *