టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హిట్ కొడితెనే ఏ హీరో కైనా భారీ స్థాయిలో డిమాండ్ క్రేజ్ ఉంటుంది. అలా గత రెండు సినిమాలుగా హిట్ అందుకు లేకపోయినా కూడా విజయ్ దేవరకొండకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. దానికి కారణం ఈ హీరోతో సినిమా చేయడానికి భారీ నిర్మాణ సంస్థలు దర్శకులు వరుసలో ఉండడమే. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అందుకోలేకపోయింది.
దాంతో ఈ హీరో పై ఈ సినిమా ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది అని చాలా మంది భావించారు. దానికి తోడు ఈ హీరో పై నెగిటివిటి గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈ హీరోకి క్రేజ్ కూడా తగ్గుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న యాడ్ ల సంఖ్య చూస్తే తప్పకుండా భారీ స్థాయిలో ఆయనకు ఇమేజ్ పెరిగింది అని చెప్పవచ్చు. అంతేకాదు భారీ నిర్మాణ సంస్థలు ఈ హీరో కోసం సినిమా చేయడానికి క్యూ లైన్ లో వెళుతూ ఉంటున్నాయి. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్లో సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు ఈ హీరోతో అదే స్థాయిలో సినిమాలు చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలో తాజాగా ఆయన గీత ఆర్ట్స్ సంస్థతో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ బ్యానర్లో రెండు సినిమాలను చేసిన విజయ్ దేవరకొండ ఆ సినిమాలనతో భారీ స్థాయిలో హిట్స్ ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రధాన రావలసి ఉంది.  శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా యొక్క షూటింగ్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననురీ సినిమాను చేయబోతున్నాడట. ఆ తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *