గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహ రెడ్డి సినిమా ను పూర్తి చేసిన బాలకృష్ణ ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది అని తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎంతో బాగా చేసే దర్శకుడు ఈ సారి అలాంటి సినిమా ను ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ సినిమాలోని కూతురు పాత్రకిగాను ఆల్రెడీ శ్రీలీల ఎంపిక జరిగిపోయింది. ఈ సినిమాకి ‘రామారావుగారు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుంది. ఇకపోతే సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటిస్తున్న వీర సింహ రెడ్డి సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇది ఎలాంటి విజయాన్ని ఆయనకు తెచ్చి పెడుతుందో చూడాలి. మొత్తానికి బాలకృష్ణ కుర్ర హీరోలకంటే ఫాస్టుగా ప్రాజెక్టులను చక్కబెడుతూ ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *