తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకతంలో చేసిన సినిమా సార్. ఇప్పటికే షూటింగ్ పూర్తికి హెసుకున్న ఈ సినిమా యొక్క విడుదల తొందరలోనే జరగనుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మొదటి నుంచి ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలనీ అంటూ చెప్పారు. కానీ అప్పుడు ఇతర భారీ సినిమాల విడుదల ఉండడంతో ఆ పోటీ నుంచి తప్పుకుంది. ఫైనల్ గా డిసెంబర్ లో ఈ సినిమా ను విడుదల చేస్తున్నామంటూ ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి లో వస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

కానీ ఈ సినిమా ముందు అనుకున్నట్లు డిసెంబర్ లో రాబోతున్నట్లు చెబుతున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలో ఒక మంచి సోషల్ మెసేజ్ ను ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు ఈ దర్శకుడు పూర్తిస్థాయిలో రొమాంటిక్ లవ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మరి ఈ సినిమా తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *