టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమె గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా జరుగుతుంది. దానికి తోడు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ ఈ చర్చ ట్రెండింగ్ అయ్యే విధంగా ఉంది. సమంత అనారోగ్యంతో బాధపడుతోందని… అమెరికాలో చికిత్స పొందుతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇది పుకారు అని అందరు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీనిపై సమంత స్పందించింది. తాను అరుదైన ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలు చెబుతున్నారు.

తన జీవితంలో మానసికంగా, శారీరకంగా మంచి రోజులతో పాటు చెడు రోజులను కూడా చూశానని.. అలాంటి పరిస్థితులను మళ్లీ భరించలేనేమో అని అనుకున్నానని… అయితే ఆ క్షణాలు గడిచిపోయానని… పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పింది. ఇక ఆమె నటించిన యశోద సినిమా నవంబర్ 11 న విడుదల కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *