ఇటీవల కాలంలో కొత్త దర్శకులు మంచి మంచి ఐడియాలతో సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. అలా ” చెరసాల ” అనే వినూత్నమైన సినిమా ను చేసిన దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం ఆ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన అప్డేట్ లతో ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరిచగా తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే రెండో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ దర్శకుడు రెండో సినిమా చేస్తుండడం విశేషం. తాజాగా ఈ సినిమా కి సంబంధించి పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో పాటు సన్నిహితులు విచ్చేశారు. ముఖ్య అతిధులుగా నమీరుద్దీన్ అహ్మద్, కతేరి అంజమ్మ , కట్ల భాగ్య లక్ష్మి, రైటర్ నరేందర్ రెడ్డి, కిషోర్, తెలుగు మహేంద్ర గారు విచ్చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు. నా తొలి సినిమా ” చెరసాల ” ఈ బ్యానర్ లో చేసాం. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ను అందించే విధంగా సినిమా కోసం పనిచేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా లను వెండితెరపైకి తీసుకు వస్తాను అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *