రకుల్ ప్రీత్ సింగ్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే ఎన్నో మంచి అవకాశాలను అందుకోని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది రకుల్ ప్రీతిసింగ్. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండడంతో ఈ మధ్య ఈమె ధ్యాస పెళ్లి వైపు మళ్ళింది. ఇక ఇదే తంతులో సోషల్ మీడియా వేదికగా తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి తెలియజేస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

రకుల్ ప్రీతిసింగ్ జాకి భగ్నానీ అనే ఒక వ్యక్తి తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని రకుల్ ప్రీతీ సింగ్ అధికారికంగా తెలియజేయలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఈ జాకీ ఎవరు అనే విషయాలపై ఎక్కువగా నెట్లో సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక జాకీ ఎవరు అనే విషయానికి వస్తే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి జాకీ.

కోల్ కత్తాలోని సింధీ ఫ్యామిలీలో పుట్టాడు జాకీ. ఇక ఈయన తండ్రి పూజ ఎంటర్టైన్మెంట్స్ పేరుమీద ఎన్నో సినిమాలను నిర్మించేవారు. అదే తరుణంలో జాకీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే సినిమాలను నిర్మిస్తూ ఉండేవాడు. అలా కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా రకుల్ ప్రీతిసింగ్ అక్షయ్ కుమార్ జంటగా నటించిన సినిమాకు నిర్మాతగా ఉండబోతున్నాడట.

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పలువురు సినీ తారలు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ రకుల్ స్వతహాగా ఈ విషయాన్ని మీడియా ముందు చెబితే బాగుంటుందని కొంతమంది అభిమానులు ఆలోచిస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *