జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులో అలాంటి పని చేసేవాడా.. చైన్ స్మోకింగ్ చేస్తూ?

సినిమా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగు పెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హీరోగా నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అదేవిధంగా మధ్యలో కొన్ని వరుస ఫ్లాప్ లను చవి చూసిన జూనియర్ ఎన్టీఆర్ మరి ఫామ్లోకి వచ్చాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ పరిధి దాటి ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇంత గొప్ప స్థాయిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు అందరిలాగే ఎన్నో అల్లరి పనులు, చిలిపి పనులు చేసేవారు. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఏమి తెలియని వయసులోనే చైన్ స్మోకింగ్ చేసేవాణ్ని అనే విషయాన్ని ఒకానొక సందర్భంలో తారక్ తెలిపారు. ఇలా చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేశానని తన అల్లరి చేష్టలు గురించి తెలియజేశారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో కొమరం భీమ్ అనే పాత్రలు నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ప్రస్తుతం తారక్ బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *