అమ్మ టబు.. నా కొడుకు నాగార్జునను వదిలేయ్యు తల్లి.. అప్పట్లో ఏఎన్ఆర్ బ్రతిమిలాడట?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో విభిన్న పాత్రలలో, ఎన్నో వందల సినిమాలలో నటించి విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఏఎన్నార్ నటించిన కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఏఎన్ఆర్ ఆరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ చివరి రోజుల వరకు నటిస్తూ.. నటనపై తనకున్న ఆసక్తి ఏంటో నిరూపించారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నాగేశ్వరరావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

ఆయన కూడా తండ్రి బాటలోనే ఎన్నో ముఖ్యమైన సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున, హీరోయిన్ టబు జంటకు అప్పట్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించి హిట్ పెయిర్ గా నిలిచారు. సాధారణంగా ఒకటి రెండు సినిమాల్లో కలిసి ఒకటే హీరో హీరోయిన్ నటిస్తే ఆ తర్వాత వారిద్దరి గురించి వచ్చే వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ హీరో హీరోయిన్ మధ్య ఏదో సంబంధం ఉందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తుంటాయి.

ఇలా టబు నాగార్జున జంటకు సంబంధించి ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. ఇలా నాగార్జున టబు గురించి అందరు మాట్లాడటంతో చివరికి నాగేశ్వరరావు వీరి విషయంలో కలుగజేసుకుని ఏకంగా టబుతో నాగేశ్వరరావు మాట్లాడుతూ దయచేసి నా కొడుకుతో నీకు ఉన్నటువంటి స్నేహ బంధాన్ని ఇక్కడితో వదిలేయ్.. నా కొడుకుని వదిలిపెట్టు అంటూ అప్పట్లో నాగేశ్వరరావు టబును బ్రతిమాలారట. అయితే వీరి మధ్య ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా వీరిద్దరు కేవలం మంచి స్నేహ బంధంలో ఉండే వారు. అలాంటి స్వచ్ఛమైన స్నేహ బంధాన్ని కూడా కొన్ని వార్తా పత్రికలు కలుషితం చేశాయని అందుకోసమే వీరిని దూరం పెట్టాలని అప్పట్లో నాగేశ్వరరావు టబును బ్రతిమాలినట్లు సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *