పెళ్లి కోసం దేవిశ్రీ ప్రసాద్ తండ్రిని కలిసిన ఛార్మి తల్లితండ్రులు.. కానీ అంతలోనే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినా నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఒకప్పుడు సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో ఉందని, అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.

ఇలా కొన్ని రోజులపాటు వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ, వార్తల గురించి వీరు స్పందించకపోవడం గమనార్హం. అయితే దేవి శ్రీ ప్రసాద్, ఛార్మి మధ్య ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో నిజంగానే ఛార్మి, దేవి శ్రీ ప్రసాద్ లకు పెళ్లి చేయాలని దేవి తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఛార్మి తల్లిదండ్రులు వెళ్లి వీరి పెళ్లి గురించి ఎన్నో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇలా పెళ్లి ద్వారా దేవి, ఛార్మి ఒక్కటవుతారని భావించారు. అయితే ఇలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత వీరి పెళ్లి విషయం కేవలం సంప్రదింపుల వరకు మాత్రమే ఆగిపోయింది.

ప్రస్తుతం చార్మి హైదరాబాద్ లో కాకుండా పలు సినిమాల షూటింగ్ నిమిత్తం ఎక్కువగా ముంబైలోనే సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే పెళ్లి పై ఎన్నో కామెంట్లు చేస్తూ పెళ్లి చేసుకోవడం కన్నా ఒక బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు అంటూ చార్మీ ఎన్నోసార్లు పెళ్లి గురించి కామెంట్లు చేశారు. అయితే ప్రస్తుతం ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు తీస్తూ వీరిద్దరు ముంబైలో ఒకేచోట ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోని పూరి ఛార్మి గురించి కూడా ఈ విధమైనటువంటి వార్తలు మొదట్లో చక్కర్లు కొట్టాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *