పక్కలో పడుకోలేదని తన జీవితాన్ని నాశనం చేశారు అంటున్న నటి..!

సాధారణంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా మంచి పొజిషన్లో ఎదగాలి అంటే దర్శకనిర్మాతల పక్కలో పడుకోవాలి.. వారి కోరిక తీర్చనిదే అవకాశాలు కూడా రావని.. ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ బాలీవుడ్ దర్శక నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీ అయినా సరే ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది అంటే తప్పకుండా ఆ హీరోయిన్ ను సినీ ఇండస్ట్రీ ఆదరిస్తుంది అనేది వాస్తవం. ఆఫర్స్ కూడా బాగానే వస్తాయి.. కానీ నా విషయంలో అలా జరగలేదు దర్శకనిర్మాతలు నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ వాపోతోంది నర్గీస్ ఫక్రీ.

10 సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ బ్యూటీ. ఈమె ఇండియన్ కాదు.. పుట్టింది అమెరికాలో.. మూలాలు వున్నది మాత్రం పాకిస్తాన్‌లో.అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చాడు ఇంతియాజ్ అలీ. ఇక తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నర్గీస్.ఈ అమ్మడు దూకుడు చూసిన తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఈమె మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, గూఢచారి, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలు మినహాయిస్తే ఈమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు.

అయితే స్టార్ కావాల్సిన తనను కొందరు కావాలనే తొక్కేసారంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది నర్గీస్. బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే కచ్చితంగా దర్శక నిర్మాతలు కోరిక తీర్చాల్సిందే అని.. అలా తనను కూడా కొందరు దర్శకులు, నిర్మాతలు పడుకోవాలని అడిగినట్లు తెలిపింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే ఎక్కడా కూడా ఎటువంటి విషయాలలో కూడా కాంప్రమైజ్ కాకూడదని, నగ్నంగా నటించకూడదని ఫిక్స్ అయిందట నర్గీస్ ఫక్రీ. ఇలా కొందరు దర్శకనిర్మాతలు మాత్రం తమ కోరిక తీర్చమని అడిగినప్పుడు, ఈమె నో అని ఖరాఖండిగా చెప్పేసిందట.

అందుకే కొందరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని తనను స్టార్ హీరోయిన్ కాకుండా తొక్కేశారు అని, క్యాస్టింగ్ కౌచ్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా ఉందని ఆమె బహిరంగంగా చెప్పేసింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *