నడిరోడ్డుపై బుల్లితెర నటి కారు ఆపి..బెదిరింపులు.. వెంటనే ఆమె..!!

బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరిత గురించి ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నో సీరియల్స్లో అత్తగానో, అక్కగానో ,అమ్మ గానో నటించి ఎంతగానో అందరినీ అలరిస్తోంది. ఈమె సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇప్పటికీ బుల్లితెరపై నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందుతోంది. సహా నటుడు జాకీ ని వివాహం చేసుకొని ఇద్దరు కూడా సీరియల్స్ లో భార్య భర్తలు గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈమెకు ఎవరో ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా కారును ఆపి మరి బాగా తిట్టారట. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హరిత ఈ విషయాలన్నింటినీ వెల్లడించడంతో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైందని చెప్పాలి.అప్పట్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రవళి కి అక్క అన్న విషయం అందరికి తెలిసిందే. కాకపోతే రవళి కంటే హరిత నే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటి అని చెప్పవచ్చు.ఇక ఈమె పలు షో లకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.

తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాలలో కూడా మొదట విలన్ పాత్రలో నటించి, సినిమాలలో మాత్రం సహాయక పాత్రలు పోషించి అక్కడ కూడా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇకపోతే తాను నటించిన ఓ సీరియల్ బాగా హిట్ అయిందని, కానీ ఆ సీరియల్ తోనే తనకు సమస్యలు వచ్చాయని తెలిపింది.తన నెంబర్ కనుక్కొని తన ఇంటికి ఫోన్ చేసి బెదిరించారట.అంతేకాకుండా చెడ్డ పనులు చేస్తే ఊరుకోమని.. మళ్లీ అలా కనిపిస్తే బాగుండదని హెచ్చరించారట.అలా వాళ్లందరికీ సర్దిచెప్పుకొని సంజాయిషీ చివరకు తన తల ప్రాణం తోకకి వచ్చిందని తెలిపింది.

తనకు విమర్శలు రావడంతో విలన్ పాత్రలలో నటించడం తగ్గించిందట.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చాక తనకు అనుకోకుండా ఈటీవీ సంఘర్షణలో నెగిటివ్ పాత్ర పోషించాల్సి వచ్చిందని తెలిపింది. అప్పుడు తన పరిస్థితి మరీ దారుణంగా ఉందని..ఒకసారి తను హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో, తన కారు ఆపి మరీ ఇదిగో ఇదే పాపని ఏడిపించేది.అసలు నువ్వు ఆడదానివేనా.పసిపిల్లని అలా చేస్తావా అని బాగా తిట్టారట. అలా ప్రేక్షకులు నన్ను తిట్టడంతో నెగిటివ్ పాత్రలకు దూరమయ్యాను అని చెప్పుకొచ్చింది హరిత.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *