ప్రేమలో విఫలం అయ్యి.. మద్యానికి బానిసై.. చివరికి అలా అయిపోయిన హీరోయిన్..!!

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎంతో విజయవంతమైన తెలుగు తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కేవలం కమర్షియల్ చిత్రాలలో మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించింది స్టేటస్ ను సంపాదించుకున్న నయనతార ప్రేమ విషయం గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. గతంలో ఈమె కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను ప్రేమించిన సంగతి అందరికీ తెలిసిందే.వీరిద్దరూ ప్రేమలో ఉండగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి.

నయనతార ప్రేమలో మునిగిపోయిన ప్రభుదేవా ఏకంగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చారు.త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ పలు మనస్పర్థల కారణంగా నయనతార ప్రభుదేవా విడిపోయారు. ఇలా ప్రేమలో విఫలమైన నయనతార కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమయినా మద్యానికి బానిస అయ్యారనీ అప్పట్లో పెద్ద ఎత్తున నయనతార ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వచ్చేవి. ఇలా పూర్తిగా మద్యానికి బానిసైన నయనతార ఒకరి కోసం తన జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏంటి అని ఆలోచించి తిరిగి తన దృష్టిని మొత్తం సినిమాల వైపు పెట్టింది.

ఇలా కొంతకాలం తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడిన నయనతార గత కొంతకాలం నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. గత కొంత కాలం నుంచి సహజీవనం చేస్తున్న వీరు నిశ్చితార్థం కూడా జరుపుకున్నారని త్వరలోనే కేరళలో ఒక ప్రముఖ చర్చిలో వీరి వివాహం జరగనుందనే వార్తలు వినిపించాయి.నిశ్చితార్థ విషయాన్ని బయట పెట్టిన నయనతార పెళ్లి విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఏ విధంగానూ ప్రకటించలేదు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *