రేయ్ నువ్వెంత..రా అంటే నువ్వెంత అంటూ.. ఒకరిపై కి ఒకరు దూసుకుని వచ్చి ..!!

ఈ రోజు హైదరాబాద్ లో మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఉదయం 8 గంటల నుంచి మా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ హోరాహోరీగా జరుగుతుండగా ఎన్నో వివాదాల నేపథ్యంలోనే ఈ పోలింగ్ జరుగుతుందని తెలుస్తుంది. అక్కడ ఏకంగా కురుక్షేత్ర వాతావరణం నెలకొందని, ఒకరిపైకి ఒకరు దూషణల పర్వం కాకుండా కొట్టుకునే దాకా ఇది వెళ్తుందని అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తుంది.

హైదరాబాద్ లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో ఎంతో మంది పోలీసుల కట్టుదిట్తమైన భద్రత లో ఈ ఎలక్షన్లకు సంబంధించిన అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. మా సభ్యులు ఓటు వేయడం కోసం ఎక్కడెక్కడినుంచి తరలి వస్తున్నారు. కాగా తాజగా ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మరియు నరేష్ ల మధ్య రసాభాస చోటు చేసుకుంది.

ఒక వ్యక్తి వచ్చి ప్రకాష్ తాజ్ టాగ్ తో ప్రచారం రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని నరేష్ ఆరోపణలు చేస్తుండగా ప్రకాష్ రాజ్ ఆయనపై కొంత వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ మీడియా ఉందని కూడా చూసుకోకుండా దూషణల పర్వానికి దిగారు. ఈ చర్య తో ఇది ఎంతవరకు వెళుతుందో అర్థం కావట్లేదు. శివబాలాజీ ని హేమ కొరకడం, ఇప్పుడు వీరిద్దరూ ఇలా ఒకరిపై ఒకరు దూసుకురావడం చూస్తుంటే రేపు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి చూడాలి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *