సాయి పల్లవి తో పెళ్లి రియాక్ట్ అయినా అఖిల్.. నా కొడకా అంటూ..!!

ఇటీవల అక్కినేని నాగచైతన్య మరియు సమంత లు తమ వివాహ బంధానికి బాయ్ బాయ్ చెబుతూ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అభిప్రాయ భేదాల కారణంగా మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్ లో మరొక జంట విడాకుల వరకు వెళ్లడం సినీ ప్రేక్షకులను ఎంతగానో కలవరపరుస్తోంది. ఏ మాయ చేసావే చిత్రంతో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయం కాగా ఆ తరువాత పలు సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

అయితే ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకు వచ్చిన వీరు దాన్ని పచ్చని సంసారం గా కొనసాగించడంలో మాత్రం విఫలం అయ్యారనే చెప్పాలి. కారణాలేవైనా కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆశించిన దీవించిన జంట ఈ విధంగా విడిపోవడం ఒక్కసారిగా అందరినీ నిరాశలో ముంచెత్తింది. రోజుకో వార్త వీరిద్దరి రిలేషన్ పై రాగా వారిద్దరు విడిపోవడానికి గల అసలు కారణాలు మాత్రం ఎవరూ వివరించక పోవడం గమనార్హం.  ఇకపోతే తాజాగా లవ్ స్టోరీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చైతు.

ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ఈ చిత్రంలో ఆమెను లిప్ కిస్ చేయడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి నాగచైతన్య సాయి పల్లవి తో ప్రేమలో ఉన్నాడని ఆ కారణంగానే ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నాడని కూడా అంటున్నారు. దీనిపై ఎవరు ఇంతవరకు స్పందించకపోవడం ఈ వార్తలు రావడానికి బలమయిన కారణం అయ్యింది. ఎవరో ఒకరు దీనిపై స్పష్టత ఇవ్వకపోతే ప్రేక్షకులు ఇది నిజం అని నమ్మే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ దీనిపై స్పందించినట్లు గా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు వస్తున్నాయి.

అక్కినేని నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ కూడా సినిమా పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగచైతన్య కూడా అతిథిగా రావడం చూస్తుంటే తమ్ముడు పై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకోసం అన్న ఏం చేయడానికైనా రెడీ గా ఉన్నాడు అని సోదర భావంతో అక్కినేని అఖిల్ నాగచైతన్య పై వస్తున్న రూమర్స్ ను ఖండించే విధంగా మాట్లాడాడట. సాయి పల్లవితో అన్న ప్రేమ విషయం ఒట్టి పుకారే అని చెబుతున్నారు.  అంతే కాదు సమంత నాగచైతన్య విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం దానిపై మాట్లాడటానికి ఎవరికీ అర్హత లేదని చెబుతున్నాడట.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *