నన్ను దారుణంగా వాడుకున్నారు. అయినా నో ఛాన్స్.. కన్నీరు పెట్టుకున్న హీరోయిన్!!

సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఫామ్ లో ఉన్నప్పుడే చేతినిండా సినిమాలు ఉంటాయి. క్రేజ్ ఉన్నప్పుడు మాత్రమే వారిని ప్రేక్షకులు అయినా దర్శక నిర్మాతలు హీరోలు ఎవరైనా పట్టించుకుంటారు. ఒకసారి వారు ఫామ్ లో లేకపోయినా చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా వారిని ఎవరు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటారు. అది వారికి తీరని ఆవేదన తెచ్చిపెడుతుంది. ఎప్పుడు ఫోటో షూట్ లు సినిమా షూటింగ్ లు, పబ్ లు పార్టీలు అంటూ తిరిగే  హీరోయిన్ లు ఒక్కసారి గా తన చుట్టూ ఎవరూ లేని లోకాన్ని ఊహించుకొని డిప్రెషన్కు గురి అవుతారు.

ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్ లు తన సినిమా జీవితం పూర్తయిన తర్వాత ఎంతో క్షోభ ను అనుభవించారు.  అవి తట్టుకుని నిలబడగలిగి వారు మళ్లీ తమ రెగ్యులర్ జీవితానికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అయితే కొంతమంది అతి తక్కువ కాలంలోనే దాని నుంచి బయటపడి పెళ్లిళ్లు చేసుకొని తమ జీవితాలను సంతోషంగా గడుపుతుంటారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో స్పెషల్ పాటలకు ఐటెం పాటలకు పవర్ ఫుల్  పాత్రలకు పెట్టింది పేరు గా ముమైత్ ఖాన్ తాజాగా తన కెరీర్ను తన జీవితం ఉన్న పరిస్థితి ను చూసుకుని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు పోకిరి సినిమాలో ఈమె ఇప్పటికింకా నా వయసు అనే పాట లో డాన్స్ చేసిన తీరుకు అప్పటి ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. ఆ పాటలో ఆమె  వేసిన స్టెప్స్ కి సినిమా ఇండస్ట్రీ సైతం ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి కాగా ఒక్కసారిగా ఆమెకు అవకాశాలు వెల్లువ వచ్చి పడింది.  వరుస ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను తన అందాలతో పిచ్చెక్కించింది ముమైత్ ఖాన్. ఐటమ్ పాటలే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది ఆమె.

దాని ద్వారా ఆమె తెలుగులో కొన్ని సంవత్సరాలు మంచి మంచి అవకాశాలతో కొనసాగగా ఒక్కసారిగా ఆమెకు అవకాశాలు తగ్గడం ఆమెను తీవ్ర కలతకు గురి చేసింది. ప్రతిరోజు షూటింగ్ లు లైటింగ్ లు అంటూ ఫుల్ బిజీగా ఉండే ముమైత్ ఖాన్ ఒక సారి గా తన చుట్టూ ఎవరూ లేకపోవడంతో బాగా నిరాశ చెందింది. సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచో ఒక అపవాదు ఉంది. అవకాశాల కోసం హీరోయిన్ లు ఏం చేయడానికైనా సిద్ధం అవుతారు అనే ఓ ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది. అది ముమైత్ ఖాన్ విషయంలో కూడా జరిగింది అని ఆమె అవకాశాల కోసం హీరో దర్శక నిర్మాతలతో కమిట్ మెంట్ కు రెడీ అయ్యి అవకాశాలను సంపాదించుకుంటుంది అనే రూమర్స్ క్రియేట్ చేశారు.

అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అవకాశాల కోసం అంత దిగజారే ప్రయత్నం మాత్రం ఆమె చేయదు అని అనే సన్నిహితులు చాలాసార్లు చెప్పారు. తాజాగా ఆమె ఓ  ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంటూ నన్ను వాడుకుని వదిలేసారు అవకాశాలు ఎవరూ ఇవ్వడం లేదు అని  చెప్పడం ఒక సారి గా తెలుగునాడులో సంచలనం సృష్టించింది.  మరి తాను ఏ విధంగా బాధ పడిందో ఏ విధంగా ఆమెను వాడుకున్నారో అనే విషయాన్ని ముందు ముందు వెల్లడిస్తుందో అనేది చూడాలి.

>

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *