చైతు కోసం వెంకీ చేసిన  పనికి కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున!!

అక్కినేని నాగచైతన్య మరియు సమంత లు ఇటీవల విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత రెండు నెలలుగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు  అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రాగా వాటిని నిజం చేస్తూ అక్కినేని నాగ చైతన్య ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. సమంత కూడా నాగ చైతన్య వెల్లడించిన కొద్దిసేపటికే తన సోషల్ మీడియా ద్వారా విడాకులు విషయంపై స్పష్టత ఇచ్చింది. ఆ విధంగా వీరిద్దరు టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా ఉండగా ఆ తర్వాత ఇద్దరు విడిపోవడం వారి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.

వీరిద్దరు ప్రేమించుకోవడం ఎంత పెద్ద సంచలనం అయ్యిందో విడిపోవడం కూడా అంతే పెద్ద సంచలనం అయ్యింది. వీరు విడిపోవడం పట్ల అభిమానులు అందరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించి వారి విడాకుల పై తమ విచారాన్ని వ్యక్తం తెలియజేశారు.  ఇక సెలబ్రిటీలు సైతం వీరు విడిపోవడం పై స్పందించారు. ముఖ్యంగా చై కుటుంబ సభ్యులు అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విచారం వ్యక్తం చేశారు.  కొంతమంది కుటుంబంలోనే తమ విచారాన్ని వ్యక్తం చేయగా ఇంకొంతమంది బహిరంగంగానే వారు తమ విచారాన్ని వ్యక్తం చేశారు.

ఆ విధంగా అక్కినేని నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ లు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. విక్టరీ వెంకటేష్ అయితే ఏకంగా అభిమానులను విమర్శిస్తూ ఈ విషయంపై స్పందించడం పెద్ద సంచలనం సృష్టించింది. అయితే అక్కినేని నాగచైతన్య సమంత ల మీద వస్తున్న పుకార్లను, విమర్శలను తగ్గించడానికి ఆ విధంగా వ్యాఖ్యలు చేశానని చెప్పాడు వెంకీ. చైతు చాలా సౌమ్యుడు అని, వాడిని ఎవరేమన్నా నేను తట్టుకోలేను అని చెప్పాడు.  పెళ్లి గురించి తాను ముందే హెచ్చరించానని అన్నీ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఈ బంధంలోకి అడుగు పెట్టాలని సూచించానని వెంకటేష్ చెప్పాడు.

మేనల్లుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అవసరమైతే తాను చైతన్య కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమేనని ఆయన వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడి పై వెంకీ మామ చూపిస్తున్న శ్రద్ధ పై నాగార్జున కంట నీరు పెట్టుకున్నాడు. వీరిద్దరు బావ బామ్మర్ది లు అన్న విషయం తెలిసిందే. వెంకటేష్ సోదరిని నాగార్జున పెళ్లి చేసుకోగా ఆమె తో అభిప్రాయ భేదాల కారణంగా దూరంగా ఉన్నాడు నాగార్జున. ఆ తర్వాత అమల ను పెళ్లి చేసుకొని  ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంతో హాయిగా గడుపుతున్నాడు. అటు నాగార్జున మొదటి భార్య లక్ష్మి కూడా వేరొకరిని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఏదేమైనా టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా ఎప్పటికీ నిలిచిపోతారు అనుకున్న సమంత మరియు నాగచైతన్య ల జంట ఇప్పుడు విడిపోవడం టాలీవుడ్లో పెద్ద  సెన్సేషనల్ వార్త గా మిగిలిపోయింది

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *