నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ.. అందుకేనా ఈ మాటలు..?

సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, పైకి ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు.ఈయన మొదట ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామని వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనులు మొదలు పెట్టాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా సహాయక పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. ఇక ఆ తర్వాత మంచి మంచి సినిమాలలో నటిస్తూ, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు స్టార్ హీరోలలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇకపోతే రవితేజ నాగార్జున గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు..అదేమిటో ఒకసారి మనం కూడా చదివి తెలుసుకుందాం..

ఆయన ఒకరోజు ఇంటర్వ్యూ లో తన లైఫ్ లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను పంచుకున్నాడు.. అక్కినేని నాగార్జున హీరో గా తెరకెక్కిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రవితేజ పని చెయ్యడమే కాకుండా, ఆ సినిమాలో చిన్న రోల్ లో కూడా మనకు కనిపిస్తాడు.

అప్పటి వరుకు రవితేజ ఎన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినా కూడా ఒక్కరు కూడా ఆయనకీ డబ్బులు ఇవ్వలేదు.. కానీ అక్కినేని నాగార్జున మాత్రం రవితేజ పని అయిపోయిన తర్వాత స్వయంగా ఆయనే పిలిచి చేతిలో 3,500 రూపాయిలు పెట్టాడట, అదే రవితేజ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అందిన రెమ్యూనరేషన్ అంట. నాలో ఉన్న పనితనాన్ని కేవలం అక్కినేని నాగార్జున మాత్రమే గుర్తించారు అంటూ తెలిపాడు రవితేజ. ఏదేమైనా నాగార్జున ఒక పనిని గుర్తించి, వారికి తగినంత సాయం కూడా చేస్తాడు అంటూ పొగిడాడు.

ఇకపోతే క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ, ప్రస్తుతం ఖిలాడి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *