అందుకే విడాకులు అయ్యాయి – ఎన్టీఆర్ షో లో సమంత…!!

ఇటీవల సమంత విడాకులపై ఎక్కడ చూసినా జోరుగా చర్చ జరుగుతుంది. సమంత ఎందుకు విడాకులు తీసుకుంది అనే విషయం ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు కానీ ఫలానా కారణం అంటూ చాలా మీడియా సంస్థలు వీరి విడాకులను నిర్ధారిస్తున్నాయి. ప్రేమించుకున్నప్పుడు ఎంత పెద్ద సంచలనం అయితే అయ్యిందో ఇప్పుడు కూడా అంతే సంచలనం అవుతుంది. ఏ మాయ చేసావే ఆటోనగర్ సూర్య మనం మజిలి వంటి చిత్రాల్లో కలిసి నటించిన వీరు ఈ సినిమాలో షూటింగ్ సమయంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

పెద్దలు కాదన్న కూడా వారిని ఒప్పించి మెప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మామ నాగార్జున తో సమంత బాగానే మెదిలింది. ఆ విధంగా సమంత అక్కినేని వారి పెద్ద కోడలు గా మంచి పేరు సంపాదించుకుంది. అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరూ విడిపోవడంతో వారిని నిరాశపరిచింది.ఇక తాజాగా సమంత ఎన్టీఆర్ షోలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ షో లో సమంత తన విడాకులపై కూడా స్పందించిందట. జెమినీ టీవీ లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో వస్తుండగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది సెలబ్రెటీలు గెస్ట్ లు గా వచ్చారు. ఆ విధంగానే సమంత కూడా ఈ షో కి గెస్ట్ గా వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే విడాకుల అనౌన్స్మెంట్ తర్వాత ఈమె బహిరంగ షో కి ముఖ్యఅతిథిగా రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈమె ఈ షోలో తన విడాకుల గురించి ఏమని చెప్పిందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.

ప్రతి శని ఆదివారాలలో సెలబ్రిటీలు ఈ షోకి అతిథులుగా వస్తుంటారు. మరి ఈ శని ఆదివారాలలో సమంత గెస్ట్ గా రావడం భారీ టీఆర్పీ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. ఇదంతా పక్కన పెడితే విడాకుల గురించి ఆమె ఏమని స్పందిస్తుందో అన్న విషయంపై అందరూ ఎదురుచూస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *