ఏం సినిమా రా ఇది.. ఉప్పెన కలెక్షన్లు ఒక్క రోజులోనే మటాష్..!!

ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రం గా సామజిక స్పృహ కలిగించే సినిమా ను ఎంచుకున్నాడు. ఓ నవల ఆధారంగా తెరకెకెక్కిన ఈ సినిమా కు క్రిష్ దర్శకత్వం వహించగా మొదటి నుంచి ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లోని పాటలు ప్రేక్షకులను ఇప్పటికే అలరించగా సినిమా ఏ రేంజ్ లో అలరించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం..

రాయలసీమ ప్రాంతానికి చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) చదువు పూర్తి చేసుకుని చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. కానీ అతని ఆత్మ నూన్యతా భావం వల్ల నగరంలో బ్రతకలేకపోతాడు. అలా నగరాన్ని వదిలి తన గ్రామానికి వెళతాడు. అక్కడ తాత రోశయ్య రవీంద్ర ను గొర్రెలతో కొండపాలం వెళ్ళమని సూచిస్తాడు. కరువు కాటకాలతో నీరు, గడ్డి దొరక్క పోవడంతో గొర్రెలను తీసుకుని కొండపొలం అనే ప్రాంతానికి బయల్దేరుతారు కొంతమంది. అలా అడవికి వెళ్లిన రవీంద్ర అడవిలో ఎదుర్కొన్న సవాళ్లతో ఎలా ధైర్యవంతుడిగా మారాడు అనేదే ఈ సినిమా కథ.

వైష్ణవ్ తేజ్ ఈ సినిమా కి మెయిన్ అసెట్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. కళ్ళతో నటిస్తూ చాలా పరిణితి ని కనపరిచి ఆ పాత్ర ను ఎంతో పండించాడు. రవీంద్ర పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. తన సీనియర్ నటి రకుల్ ని మించిన హావభావాలను పలికించాడు. ఇక రకుల్ ప్రీత్ నటన ఈ సినిమా కి హైలైట్.. ఎప్పుడు గ్లామర్ పాత్రలనే పోషించిన రకుల్ ఈ సినిమా లోని ఓబుళమ్మ పాత్ర తో అందరిని ఆకర్షించింది. హీరో ను కొన్ని చోట్ల డామినేట్ చేసింది. కోట శ్రీనివాస రావు చాలా రోజుల తర్వాత తెరపై కనిపించరు. హీరో కి దిశా నిర్దేశం చేసే పాత్ర లో ఆకట్టుకున్నారు. అంథోని, హేమ, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ లు మంచి నటన కనపరిచాడు. రవి ప్రకాశ్ ఇందులో అంకయ్య పాత్ర సినిమా ను అందరు ఆలోచించేలా చేస్తుంది. అన్నపూర్ణమ్మ, నాజర్, లోకి, శ్యామల, సుభాషిణి తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు క్రిష్‌, నిర్మాతలో ఒకరైనా రాజీవ్ రెడ్డి అతిధి పాత్రల్లో మెరిశారు.

ఈ సినిమా ఆలోచన పుట్టడానికి కారణమైన సన్నపురెడ్డి కి హ్యాట్సాప్ చెప్పాలి. కథ మాత్రమే కాదు మాటలతోనూ అయన ప్రేక్షకులను ఎంతో ఆలోచింపచేశాడు. ఎన్నో సంభాషణలు ప్రేక్షకులను కదిలిస్తాయి. దీనికి సరైన రూపాన్ని కల్పించి తెరపై అందంగా చిత్రీకరించిన క్రిష్ ప్రతిభ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా అయన ఎప్పుడు తనను తాను రుజువు చేసుకున్నాడు. కాకపోతే ఈ సినిమా లో అడవి అందాలను చాలా బాగా చిత్రీకరించి ఓ మెట్టు పైకెక్కారు. జ్ఞానశేఖర్ తన కెమెరా పనితనం సినిమాలో అద్భుతమైన విజువల్స్ ని చూస్తే తెలుస్తుంది. ఎం ఎం కీరవాణి సంగీతం ఈ సినిమా కి హైలైట్. సీతారామశాస్త్రి పాటలు మంచి సాహిత్య విలువలతో కూడుకున్నవి గా ఉన్నాయి. ఎడిటర్ శ్రవణ్ కటికనేని పర్వాలేదనిపించుకున్నాడు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.

యువతలో మంచి ఆత్మవిశ్వాసం నింపే సినిమా ఇది. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లకు హాజరయ్యే యువకులకు ఇది మంచి పాఠం వంటిది. కమర్షియల్ సినిమా అనే ఆలోచన ను పక్కన పెడితే సామజిక స్పృహ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు తప్పకుండా ఓ మంచి అనుభూతి ని ఇస్తుంది. పక్కా ఫిల్మీ రేటింగ్ : 3/5

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *