విడాకుల తర్వాత సమంత చేసిన షాకింగ్ పని ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సమంత విడాకుల విషయంలో రోజుకో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత సమంత మరోసారి ఒక షాకింగ్ విషయాన్ని అభిమానులకు తెలియజేసింది. పెళ్లికాకముందు సమంత సోషల్ మీడియా ఖాతాలో తన పేరు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. పెళ్లి తర్వాత ఆ పేరును కాస్తా సమంత అక్కినేనిగా మార్చుకున్నారు. అక్కినేని ఇంటి కోడలిగా అడుగు పెట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఈమెకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.

ఏ మాయ చేసావే సినిమాతో ప్రేమలో ఉన్న వీరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించే ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. సమంత ఎప్పుడైతే సమంత అక్కినేని అనే పేరులో అక్కినేని తొలగించి కేవలం ఎస్ అనే సింగిల్ లెటర్ పెట్టుకోవడంతో వీరి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సమంత నాగచైతన్య నుంచి విడిపోవడం వల్లే అక్కినేని అనే పేరును తొలగించిందా.. అంటూ కథనాలు మొదలైయాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనంటూ అక్టోబర్ రెండవ తేదీ ఈ జంట తమ విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇలా నాగచైతన్య సమంత వారి విడాకుల విషయం గురించి బయటపెట్టడంతో ఎంతోమంది అభిమానులు షాక్ అయ్యారు. ఇకపోతే సమంత విడాకులు తీసుకున్న తర్వాత మరోసారి తన పేరును మార్చుకున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఎస్ అని ఉన్న పేరుకు బదులుగా సమంత అనే పేరును పెట్టుకున్నారు. ఇలా సమంత మరోసారి సోషల్ మీడియా ఖాతాలో తన పేరుని మార్చుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *