జయం సినిమా షూటింగ్ లో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా..?

జయం సినిమా విడుదల అయ్యి 19 సంవత్సరాలు అయిన తర్వాత ప్రస్తుతం ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది ఈ సినిమా హీరోయిన్ సదా.. నితిన్ జీవితానికి ఇదో అతిపెద్ద మైలురాయి అని చెప్పవచ్చు.. సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో ఫోన్లు వచ్చాయి కాబట్టి ,ఆ ఇబ్బంది లేదు ..అయితే ఆ నాటి కాలంలో ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేదు కాబట్టి.. ఎవరో ఒకరు బయటకి వచ్చి చెప్తే తప్ప ఆ సినిమాల సంగతి తెలిసేది కాదు.. ముఖ్యంగా వీళ్లు ఇలా చేశారు అంటూ.. ఎవరైనా మ్యాగజైన్లో రాస్తే అబ్బో అవునా అనుకునేవాళ్ళు.. సినిమా షూటింగ్ లు అంత రహస్యంగా జరిగేవి కానీ.. ఈ మధ్యకాలంలో సినిమా షూటింగులు మొత్తం లీక్ అయి ఈ సినిమాపై అంచనాలు కూడా తగ్గుతున్నాయి.

దాదాపు 19 సంవత్సరాలుగా ఎవరికీ తెలియని ఒక కార్ ఆక్సిడెంట్ గురించి ఇటీవల వెల్లడించింది. తేజ తెరకెక్కించిన ఈ చిత్రంలో నితిన్ ,సదా జంటగా నటించారు.. వీళ్ళతో పాటు మరో 40 మంది నూతన నటీనటులు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈమధ్య ఒక షో కి వచ్చిన ఈమె చాలా ముచ్చట్లను ప్రేక్షకులతో పంచుకుంది.. జయం సినిమా షూటింగ్ లో జరిగిన అతిపెద్ద భారీ యాక్సిడెంట్ గురించి కూడా ఓపెన్ అయిపోయింది.. నెల్లూరు సమీపంలో రోజు ఒక అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగ్ పూర్తి చేశాడు తేజ..

దీని కోసం రోజు కొన్ని కిలోమీటర్లు సుమోలో నితిన్, సదా తో పాటు మరో ఇద్దరు కూడా వెళ్లేవాళ్లు. అయితే ఒకరోజు అడవి మధ్యలో ఉన్నట్లుండి సుమో టైర్ పేలిపోయింది. దీంతో వారు ప్రయాణిస్తున్న సుమో మూడు పల్టీ లు కొట్టిందట. ఆ సమయంలో తను నిజంగానే చని పోతానేమో అని అనుకున్నారట సదా.. అది నిజంగానే ఒక అతి భయంకరమైన సంఘటన అని తెలిపింది .. పైకి లేవడానికి చూస్తున్న కూడా కుదరడం లేదని ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది సదా..ఈ యాక్సిడెంట్ గురించి తలుచుకుంటే ఇప్పటికీ తనకు నిద్ర రాదు అంటూ కూడా తెలిపింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *