కర్మ అంటే ఇదే.. ఇండస్ట్రీ నుంచి సామ్ ఔట్.. సిద్ధూ ఇన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సమంత నాగ చైతన్య విడాకుల విషయం గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగ చైతన్యతో పరిచయం ఏర్పడకముందు సమంత నటుడు సిద్ధార్థతో కలిసి ప్రేమలో పడింది. అప్పట్లో వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ కలసి జబర్దస్త్ అనే సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని అప్పుడు పెళ్లి శాంతి పూజలు కూడా చేయించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో సమంత సిద్ధార్థ నుంచి విడిపోయి చైతన్యతో పరిచయం ఏర్పరుచుకుంది.

ఈ విధంగా చైతన్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ కాస్త 2017వ సంవత్సరంలో వివాహబంధంగా మారింది. ఈ క్రమంలోనే సమంత ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి సిద్ధార్థ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.మరి అతనికి అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయం తెలియలేదు. సిద్ధార్థ్ మహాసముద్రం సినిమాతో తిరిగి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు.

విచిత్రం ఏమిటంటే సిద్ధార్థ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా సమంత తన వైవాహిక జీవితం నుంచి ఎగ్జిట్ కావడం గమనార్హం. ప్రస్తుతం మహాసముద్రం సినిమాలో నటిస్తున్న సిద్ధార్థ్ హైదరాబాద్లోనే ఉన్నారు. సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కారణంగా స్పైన్ సర్జరీ చేయించుకుని లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే మహా సముద్రం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలలో హైదరాబాదులో ఉన్న సమయంలోనే సమంత విడాకులు తీసుకున్న అంటూ వచ్చిన వార్త విన్న సిద్ధార్థ్ వెంటనే తన పై పరోక్షంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.. మోసం చేసే వాళ్ళు మంచిగా బ్రతకలేరు అంటూ పరోక్షంగా సమంతను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సిద్ధార్థ ఎంట్రీ ఇవ్వడం, సమంత ఎగ్జిట్ అవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *