ఏం మనుషులు రా.. మొన్న విడాకులు.. నేడు సమంత రెండో పెళ్లికి రెడీ అంటూ ప్రచారం?

సమంత నాగచైతన్య శనివారం వారి విడాకులను ప్రకటించిన తర్వాత మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు. ఇలా విడాకులు అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఆ తరువాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వారి విడాకులకు కారణం ఏంటంని ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే సమంతకు నాగచైతన్యకు మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం సినిమాలే అని చెప్పాలి. సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడమే కాకుండా బోల్డ్ పాత్రలలో పొట్టి పొట్టి దుస్తులు ధరించి కనిపించడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.

ఇక సమంత తాజాగా నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత మరి బోల్డ్ లుక్ లో కనిపించడంతో ఈ విషయం గురించి నాగచైతన్య సమంతల మధ్య మనస్పర్థలు వచ్చాయని, కరోనా సమయంలో వీరిద్దరూ పిల్లలకోసం ప్లాన్ చేయాలని అక్కినేని కుటుంబం చెప్పగా అందుకు ససేమిరా అన్న సమంత ఈ కారణాల చేతనే వీరు చివరికి విడాకుల వరకు వెళ్లారని తెలుస్తుంది. విడాకులు తీసుకున్న తరువాత సమంత ఎప్పటిలాగే తన తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొంది. షూటింగ్లో కెమెరా ముందు మంచిగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఎంతో బాధ పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంత ఇలా విడాకులు తీసుకుందో లేదో అప్పుడే తన రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. అయితే గతంలో సమంత రిలేషన్షిప్ లో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా షికార్లు చేశాయి. అయితే గత కొన్ని నెలల క్రితం సమంత పుట్టినరోజు సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియజేశారు. వారిద్దరి మధ్య కేవలం సోదరీ సోదరుల రిలేషన్ షిప్ ఉందంటూ సమంత తెలియజేశారు. అయితే సమంత తనతో రిలేషన్ లో ఉండటంవల్ల తనని పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి ఉంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *