హార్దిక్ పాండ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన.. ఎమ్మెస్కే ప్రసాద్..?

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు.ఇందులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు ఓపెనర్ పృథ్వీ షా, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకి చోటు దక్కలేదు.ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఏడు మ్యాచ్‌లాడిన హార్దిక్ పాండ్యా.. కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్‌కి ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ 9 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో.. ఇక టీ20, వన్డేల్లో అతని స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడించే అవకాశం ఉంది.అయితే వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్యా మునుపటి తరహాలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దానితో టెస్టుల్లో అతడిని కేవలం బ్యాట్స్ మెన్ గా వినియోగించుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ 2021 లో వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన పృథ్వీ షా ను పక్కన పెట్టడం వెనుక అతని గత రికార్డులే కారణమని తెలుస్తోంది.

 అయితే మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హార్దిక్ పాండ్యా ను ఎంపిక చేయకపోవడం పట్ల ఒక విశ్లేషణ తెలియజేశారు. హార్దిక్ పాండ్యా కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఆల్ రౌండర్ గా నిరూపించుకున్న, క్రమంగా తన ఫామ్ కోల్పోతూ వచ్చాడు. వెన్నునొప్పి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు హార్దిక్ పాండ్యా . అయితే  సర్జరీ తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో అతడి చేత ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. హార్దిక్ పాండ్యా ను కేవలం బ్యాట్స్ మెన్ గా మాత్రమే ఉపయోగించారు. ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్థిక్ పాండ్యా ఈమధ్య బౌలింగ్ చేయడం లేదు. ఒకవేళ బ్యాటింగ్ చేస్తున్న కూడా నిలకడ లేకుండా పోయింది.అందుకే ఇకపై అతడిని టెస్టులకు పరిగణించక పోవచ్చు అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.

అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హార్దిక్ పాండ్యా ను ఇకపై జట్టుకు ఎంపిక చేయడం కష్టమేనని ప్రసాద్ వెల్లడించారు. అలాగే కేవలం బ్యాట్స్ మెన్ గా కావాలి అనుకుంటే టీమిండియా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు . హనుమ విహారి ని కూడా అందుకే ఎంపిక చేశారు  అని చెప్పుకొచ్చారు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంఫ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగనున్నది. ఆ తరువాత కూడా భారత జట్టు ఇంగ్లాండ్ లోనే ఉంటుంది. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ తో తలపడనున్నది. అయితే కరోనా కారణంగా క్రికెటర్లు అందరు బయో బబుల్ లో ఉండాల్సి రావడం తో రెండు సిరీస్ లకు 24 మంది సభ్యులతో కూడిన జంబో టీమ్ ను ఎంపిక చేశారు. ఇందులో 20 మంది రెగ్యులర్ టీమ్ మెంబెర్స్ కాగా,నలుగురు యువ ప్లేసర్ లను స్టాండ్ బై ప్లేయర్లు గా ఎంపిక చేసింది. అయితే ఈ నెల ఆఖరి లోపు టీమిండియా ఇంగ్లాండ్ కు బయలు దేరి వెళ్లనున్నట్టు సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *