వైద్యారోగ్య శాఖ అంటేనే భయపడుతున్న తెలంగాణ మంత్రులు…?

తెలంగాణలో ప్రస్తుతం వైద్యశాఖ అని పేరు వింటేనే మంత్రులు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ శాఖ బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు నేతలు కూడా వివిధ సమస్యల్లో చిక్కుకోవడంతో ఉమ్మడి ఏపీలో దేవదాయ శాఖ లాగే ఇప్పుడు ఆరోగ్యశాఖ అంటేనే హడలిపోతున్నారు. అయితే తాజాగా భూ వ్యవహారంలో మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్ అయ్యారు.అయితే ప్రస్తుతం ఈ శాఖను సీఎం కేసీఆర్ బదిలీ చేయగా అసలు ఆ శాఖలోని ఎందుకు అలా జరుగుతోంది  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రులకు కలిసి రావడం లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు ముగ్గురు నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.అయితే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించే ఉద్వాసనకు గురైన వ్యక్తులలో మంత్రి ఈటల రాజేందర్ రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి డాక్టర్ రాజయ్య.2014 జనవరి లో  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య ను ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ క్యాబినెట్ నుంచి తొలగించారు. అయితే ఇది చాలా తీవ్రమైన చర్య. కెసిఆర్ మొదటి ప్రభుత్వంలో రాజయ్య పై వేటు పడగా తాజాగా ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. అయితే  డాక్టర్ రాజయ్య ఆరేళ్ల పాటు పదవిలో ఉన్నాడు. అలాగే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాజీ లక్ష్మారెడ్డి కూడా నకిలీ సర్టిఫికెట్ల వివాదంలో ఇరుక్కున్నారు. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ ఎంపీ రేవంత్ అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత కెసిఆర్ 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శాఖ బాధ్యతలను సీనియర్ నేత ఈటలా రాజేందర్ కి అప్పగించారు.

అయితే ఈటల మంత్రివర్గంలోకి వచ్చిన కొన్ని నెలల నుండి ఆయనను తొలగిస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఎప్పటికప్పుడు బర్తరఫ్ వాయిదాపడుతూ రాగా తాజాగా  భూకబ్జా ఆరోపణలతో ఈటల ను తొలగించేశారు.అయితే ఇప్పడు ఈ శాఖ కేసీఆర్ నిర్వహిస్తుండటంతో కేసీఆర్ కి పదవిగండం పొంచి ఉందా అన్న చర్చ మొదలైంది. ఎలాగో కేటీఆర్ ని సీఎం చేస్తున్నారన్న ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ కూడ వైద్యశాఖ ఎఫెక్ట్ తో పదవి కోల్పోతారా అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *